సాయంత్ర ం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే
దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు
ఎర్రగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. సాయంత్రం వేళ సూర్య కిరణాలు
ఏటవాలుగా పడుతుండటంవల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.
అలా ప్రయాణించేటప్పుడు సూర్య కిరణాలలో ఎరుపు రంగు తప్ప మిగిలిన అన్ని
వర్ణాలు ధూళి కణాల వల్ల చెల్లా చెదురయిపోతాయి. కాంతిలో ఉండే
మిగతావర్ణాలకంటే ఎరుపు రంగుకి తరంగ ధైర్ఘ్యం ఎక్కువ కావడమే దీనికి కారణం.
దాంతో ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉండడం వల్ల
అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
0 comments:
Post a Comment