చీమలను ఐకమత్యానికి గుర్తుగా పేర్కొంటాం. క్రమశిక్షణలో కూడా వాటికి
ప్రత్యేకత ఉంది. ఒకే పుట్టలో చాలా చీమలు కలిసి ఉండటమే కాదు, విపత్కర
పరిస్థితిలో అన్ని చీమలూ కలిసి పోరాడతాయి. వీటి శరీర నిర్మాణం కూడా చాలా
ప్రత్యేకంగా ఉంటుంది.
చీమలు పది కోట్ల సంవత్సరాల క్రితం కందిరీగల
నుంచి విడిపోయి ఒక ప్రత్యేక జీవులుగా రూపాంతరం చెందాయి. సుమారు 22 వేల
రకాలు చీమలు ఉన్నాయని అంటారు. చీమలకు మానవుని శరీరంలో లాగా ఊపిరితిత్తులు,
గుండె ఉండవు, వీటికుండే రక్తానికి కూడా రంగు ఉండదు. వీటి శరీరం పైకవచానికి
ఉండే సన్నటి రంధ్రాల ద్వారా చీమలు ఊపిరి పీల్చుకుంటాయి. వీటికి బయటకు
కనబడేవి రెండు కళ్ళే అయినా వాటి తలలో చిన్నచిన్న కళ్లు అనేకం ఉంటాయట.
చీమలు ఆహారసేకరణలో ముందుచూపుతో ఉంటాయని కూడా మనకు తెలిసిందే. అయితే ఈ
చీమలు వాటి బరువు కంటే ఇరవై రెట్లు బరువును మోయగలవు అంటే ఆశ్చర్యం కలగక
మానదు. ఇది నిజం. కొన్ని రకాల చీమలైతే వాటి బరువు కంటే 25 నుంచి 50 రెట్ల
బరువును కూడా లాక్కొని వెళ్లగలవట.
చీమలతో పోలిస్తే మనం అవి
మోసినంత బరువులో పదోవంతు కూడా మోయలేమేమో! పెద్ద పెద్ద వస్తాదులు,
వెయిట్‌లిఫ్టర్లు కూడా మహా అయితే వారి బరువుకన్నా నాలుగైదు రెట్లు బరువును
మాత్రమే మోస్తారు! దీనినిబట్టి మనం చీమ మోసిన స్థాయిలో బరువును మోయలేమని
రుజువైనట్లే కదా!
0 comments:
Post a Comment