
స్లోత్స్ రాత్రిపూట
చురుకుగా ఉంటాయి. స్లోత్స్ చెట్ల మీదే నిద్రపోతాయి. నిద్రపోయేటప్పుడు రెండు
కాళ్లను దగ్గరగా చేసి చేతుల మీద తలను పెట్టుకుంటాయి. ఇవి చూడడానికి
చెట్టులో భాగంగానే కన్పిస్తాయి. ఇవి సాధారణంగా చెట్టు మీద నుంచి దిగవు.
ఎప్పుడైనా చెట్టు మీద నుంచి కిందికి దిగితే కాళ్లు ఉన్నా నడవకుండా పాకుతూ
ఉంటాయి. వరదలు వచ్చిన సందర్భాల్లో ఈత కొడతాయి. వీటికి జీర్ణాశయం పెద్దది.
అయినప్పటికీ జీర్ణక్రియ చాలా మందకొడిగా జరుగుతుంది. ఒక్కొక్కసారి
జీర్ణక్రియ పూర్తి కావటానికి నెల రోజులు కూడా పడుతుంది. అందుకే ఇవి ఎక్కువ
సమయం నిద్రపోతుంటాయి.
0 comments:
Post a Comment