Tuesday, January 8, 2013

ఫ్లెమింగోకి ఆ రంగులు ఎలా వస్తాయి?

తెలుపు, గులాబీ, కాషాయ రంగుల్లో పొడవైన కాళ్లతో అందంగా ఉండే పక్షులు ఫ్లెమింగోలు. వాటికి ఆ రంగులు వాటి ఆహారం వల్ల వస్తాయి.


సాధారణంగా ఇవి నీటిలో నివసించే ఆల్గే, పీతలు, రొయ్యలను తింటాయి. వీటిలో ఉండే కెరటినాయిడ్స్ అనే వర్ణ ద్రవ్యం వల్ల ఫ్లెమింగోలకు అందమైన వర్ణం వస్తుంది. ఈ కెరటినాయిడ్లను ఫ్లెమింగోల కాలేయంలోని ఎంజైమ్‌లు గులాబీ, కాషాయ వర్ణ పరమాణువులుగా విడగొట్టి వాటి ముక్కు, కాళ్లు రెక్కల్లో నిల్వ చేయడంతో ఇవి ఆ రంగులోకి మారతాయి.

నారాయణ పక్షి - (Black Crowned Night Heron)

ఇవి నీటి అడుగున ఉన్న జీవాలను కూడా మసకచీకట్లో చూడగలుగుతాయి.కప్పలు, చేపలు, కీటకాలని మాత్రమే కాకుండా చిన్న చిన్న పక్షుల్ని కూడా తింటాయి.


తల, వీపు నలుపు, నీలం రంగులలోను, రెక్కలు బూడిదరంగులో ఉంటాయి. కంఠం, పొట్టభాగం తెల్లగా ఉంటాయి.వీటి కళ్లు చాలా పెద్దవి.


సుమారు 1.5 ఔన్సుల బరువు, 26 అంగుళాల పొడవు ఉంటాయి.ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 3 నుంచి 5 గుడ్లు పెడతాయి. 25 సంవత్సరాలు జీవిస్తాయి.

మేఘాలు వివిధ ఆకారాల్లో ఎందుకు ఉంటాయి?

ఆకాశంలోకి చూసినప్పుడు మేఘాలు పలు ఆకారాల్లో కనపడుతుంటాయి. మేఘమంటే నీటి బిందువే. దాని చుట్టూ ఉన్న గాలి కారణంగా వాటి ఆకారాలు మారుతుంటాయి. వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది. దీనికి తోడు మేఘాల్లోని నీటిబిందువులు ఘనీభవిస్తాయి. కావలసినంత చల్లదనం లేని మేఘాలు తక్కువ ఎత్తులో ఏర్పడి అప్పుడ ప్పుడు ఆకాశంలో దుప్పటిలా పరచుకోవడమూ చూస్తుంటాం.


మేఘాల్లోని నీటిబిందువులు గాలిలోని ఉష్ణోగ్రత అనుసరించి దగ్గరగా లేదా దూరంగా అమరి ఉంటాయి. వాతావరణంలో గాలివాటం ఎప్పుడూ మారుతుంటుంది. ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుంది. అలాగే గాలి పయనించే వివిధ దిశల్లో లాగుతూ తోస్తూ ఉంటుంది. ఇలా వాతావరణంలోని గాలి వల్ల మేఘాలు వివిధ ఆకారాలలో కనిపిస్తాయి.

Monday, January 7, 2013

Which one you will prefer?

Benefits of Apple & Banana

Saturday, January 5, 2013

Healthy, Delicious Snacks!

If you're looking for a savory snack with a little bit of a crunch, put down the Doritos and grab a bowl of roasted edamame. Get about two cups of shelled edamame and pour into a bowl. Mix it with two teaspoons of olive oil, salt and pepper, then put it on a baking sheet in the oven at 375°F for a half hour. Just make a batch and store them for later so you will be able to grab your roasted edamame on the go.

Friday, January 4, 2013

Heart shape Muggulu-3

SOME HEART SHAPED MUGGULU FOR SANKRANTHI FESTIVAL
1 added newly on 10-1-2013

Arrow Muggulu-2

SOME ARROW SHAPE MUGGULU FOR SANKRANTHI
1 added newly on 10-1-2013

Thursday, January 3, 2013

Simple Emergency Light Circuit

This is one of the most cost effective (cheap) and simple emergency light circuit.

 

                This is an Automatic Emergency Lamp with Day Light Sensing, means it senses darkness/night and turns ON automatically. Similarly it senses day light and turns OFF automatically.

              A simple Emergency Lamp which does not require any special equipment; even a multimeter to assemble and use. Any individual who can do a good quality soldering must be able to build this circuit successfully. This can be easily accommodated in the defunct two 6 watt tube National Emergency Lamp or any PL tube type emergency lamp. The difference will be in the working; it will work non stop for more than 8 hours. Deep discharge is taken care by the LED characteristic and over charge protection is taken care by the fixed voltage regulator.This uses a simple 3Pin fixed regulator which has a built in current limiting circuit. The only required adjustment is the preset which has to be set to ensure the LEDs just light up (it should be left at that position). The 5mm LDR is just mounted on top of the emergency light as shown in the photograph. LDR is used to avoid it lighting up during day time or when the room lights are ON. 2 LEDs are used in series; the dropping resistance is avoided and 2 LEDs light up with current that is required for a single LED,  by which energy is saved to a great extent.

Note: This particular circuit has been kept so simple for people who has limited access to components or in other words this is an emergency light that you can build with minimum components.

Circuit Diagram

Wednesday, January 2, 2013

ఆల్బట్రాస్ (Black browed Albatross)

సముద్రపక్షుల్లోకెల్లా పెద్దది ఆల్బట్రాస్. రెక్కలు ఆడించకుండా ఎంత దూరమైనా నీటిపై ఎగరగలవు.  ఇవి సబ్ అంటార్కిటికా, కేప్‌హార్న్, స్టాటన్ ఐలాండ్, కెర్‌గ్యూలెన్, హెర్డ్, దక్షిణ జార్జియా, క్యాంప్‌బెల్ దీవుల్లో, ఫాక్‌లాండ్‌లోనూ కనపడతాయి.  సముద్రం మీద ఈదురు గాలులు వీచుతున్నప్పటికీ వాటిపై స్వారీ చేస్తున్నట్టు ఎగరడం వీటి ప్రత్యేకత.  సముద్రతీరాల్లో పెంగ్విన్‌లతో, బూడిదరంగు ఆల్బట్రాస్‌లతో కలిసిమెలసి ఉంటాయి.  ఇవి ఎక్కువగా చేపలు, బురదపాముల్ని తింటాయి. వీటి జీవితకాలం 80 సంవత్సరాలు.

ఎలుకలు అన్నిటినీ ఎందుకు కొరుకుతాయి?

మనకి గోళ్లు పెరుగుతున్నట్టే ఎలుకలకు ముందు పళ్లు పదునుగా పెరుగుతూ ఉంటాయి. మనం గోళ్లను కత్తిరించుకున్నట్టే, ఎలుకలు పళ్లను కత్తిరించుకోవాలి కదా? అందుకే అవి ఆకలిగా ఉన్నా లేకున్నా ఏదో ఒక వస్తువును కొరుకుతూ ఉంటాయి. అంటే వాటి పళ్లను ఎప్పటికప్పుడు అరగదీసుకుంటాయన్నమాట. 

           ఎలుకల్లాంటి ప్రాణులు కొంతకాలంపాటు ఏ వస్తువునూ కొరక్కుండా ఉంటే పళ్లు పెరిగిపోయి నోరు నిత్యం తెరిచి ఉంచాల్సి వచ్చేది. అందుకే అవి ఎంతో బలమైన సిమెంటు, ఇనుప వస్తువులు, స్థంభాలను కూడా కొరకడానికి ప్రయత్నిస్తుంటాయి. అంతేగాని అవి తెలివితక్కువ జంతువులేమీ కావు!

Tuesday, January 1, 2013

విర్గా అంటే ఏమిటి?

ఆకాశం నుంచి కురిసిన వర్షం అంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడిగాలి ద్వారా పడు తూనే గాలిలో ఆవిరైపోతుంది. ఇలా కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకుండా ఆవిరైన భాగాన్నే విర్గా అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతతో పొడివాతావరణం ఉండే ప్రాంతాలైన ఎడారుల్లో కనపడుతుంది.


ఇది వాతావరణ శాస్త్రంలోని వేరియబుల్ ఇంటెన్సిటీ రెయిన్ గ్రేడియంట్ ఎలాఫ్ట్‌కు సంక్షిప్తరూపం ఆకాశంలో సూర్యుడు అస్తమించే సమయంలో అప్పుడప్పుడు కనిపించే అందమైన వర్ణాలకు ఒక రకంగా విర్గా కూడా కారణమే.

Tandanana ahi

Tandanana Ahi Tandanana pure - Annamayya Keerthana ku Telugu Swaralu
Both in JPG & PDF FORMAT