Showing posts with label Birds. Show all posts
Showing posts with label Birds. Show all posts

Monday, January 28, 2013

బ్లాక్ బర్డ్ (Black Bird)

ఇవి ఆఫ్రికా, యూరప్, దక్షిణ ఆసియా, ఐలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకోగలవు.

శత్రువుల నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు గూటిలోని పిల్లలను శబ్దాలతో హెచ్చరిస్తాయి.
దీని ముక్కు నారింజరంగులో సూదిగా ఉంటుంది. కంటి చుట్టూ పచ్చని రింగులా ఉంటుంది. మిగతా శరీరమంతా నల్లని ఈకలు కలిగి ఉంటుంది. వీటిలో ఆడపక్షులకు బూడిదరంగు ఈకలు ఉంటాయి.

ఇవి సుమారు 10 అంగుళాల పొడవు, 4 ఔన్సులు బరువు ఉంటాయి. ఎక్కువగా వానపాములు, పురుగులు, పండ్లను తింటాయి. ఇవి చలికాలంలో అనువైన ప్రదేశాలకు వలసవెళ్లి తమ సంఖ్య పెంచుకుంటాయి.

వల్లంకి పిట్ట (Common Snipe)

ఇవి పశ్చిమ యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలలో ఎక్కువగా కనబడుతూంటాయి. వేరే ప్రాంతాలకు వల సపోతూంటాయి. అక్కడ చలికాలంలో మరింత దక్షిణంగా వెళతాయి.

బూడిద, నలుపు రంగుల్లో చీర డిజైన్‌లా శరీరమంతా ఉంటుంది. తలమీద ఉడతలాగ రెండు లేదా మూడు గీతలు ఉంటాయి.

ఎగిరే సమయంలో ఒకేవైపు నేరుగా వెళ్లదు. కొంతదూరం నేరుగా ఆ తర్వాత పక్కలకు తిరిగి కొంతసమయం తర్వాత నేలకు దగ్గరగా వంకర టింకరగా వెళుతూంటుంది.

ఇవి 4.5 ఔన్సుల బరువు, 11 అంగుళాల పొడవు ఉంటాయి.వీటి రెక్కలు 5 అంగుళాలు విచ్చుకుంటాయి.

ఇవి ఏప్రిల్, జూలై మధ్యకాలంలో 4 వరకూ గుడ్లుపెడతాయి.ఇవి ప్రధానంగా కీటకాలు, పురుగులు, కప్పల్ని తింటాయి.

Tuesday, January 8, 2013

బోట్ బిల్ హెరాన్ (Boat Billed Heron)

దీని ముక్కు నీలిరంగులో, చూడ్డానికి చిన్న పడవలా ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ఇది ఒంటరి పక్షి. మనుషులకు, ఇతర పక్షులకు దూరంగా ఉంటుంది.ఇవి ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలో, దక్షిణ మెక్సికో నుంచి బొలీవియా వరకూ; ఉత్తర అర్జెంటీనా లోనూ కనపడతాయి.

వీటి పిల్లలకు పుట్టుకనుంచే రెండు చిన్ని పళ్లు ఉంటాయి.పొట్ట, కాళ్లు గోధుమ రంగులో; రెక్కలు నీలి, నలుపు, బూడిదరంగుల్లో ఉంటాయి. నిలబడితే తోకభాగం కింది వరకూ ఉంటుంది.4.7 ఔన్సుల బరువు, 24 అంగుళాల పొడవు ఉంటాయి. నాలుగు వరకూ గుడ్లుపెడతాయి. ఇవి కీటకాలను, పురుగులను తింటాయి. ఎక్కువగా రాత్రిపూటే తిరుగుతుంటారయి.

నారాయణ పక్షి - (Black Crowned Night Heron)

ఇవి నీటి అడుగున ఉన్న జీవాలను కూడా మసకచీకట్లో చూడగలుగుతాయి.కప్పలు, చేపలు, కీటకాలని మాత్రమే కాకుండా చిన్న చిన్న పక్షుల్ని కూడా తింటాయి.


తల, వీపు నలుపు, నీలం రంగులలోను, రెక్కలు బూడిదరంగులో ఉంటాయి. కంఠం, పొట్టభాగం తెల్లగా ఉంటాయి.వీటి కళ్లు చాలా పెద్దవి.


సుమారు 1.5 ఔన్సుల బరువు, 26 అంగుళాల పొడవు ఉంటాయి.ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 3 నుంచి 5 గుడ్లు పెడతాయి. 25 సంవత్సరాలు జీవిస్తాయి.