Showing posts with label Animal Planet. Show all posts
Showing posts with label Animal Planet. Show all posts

Tuesday, January 8, 2013

ముంగిస (Mongoose)

ఇది ఒక చిన్న క్షీరదం. ఇవి ఎక్కువగా దక్షిణ యూరప్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో నివసిస్తాయి.బొరియలలో నివాసముంటాయి.ఇవి మాంసాహార జీవులు.వీటి బరువు 340 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఉంటుంది.


ముంగిస పొడవు 7 నుంచి 25 అంగుళాలు ఉంటుంది. 6-21 అంగుళాల పొడవుండే గుబురైన తోక ఉంటుంది.వీటి జీవితకాలం సుమారు 20 సంవత్సరాలు.ముంగిసలలో కొన్నిజాతులు రాత్రుళ్లు సంచరిస్తుంటాయి.ముంగిస కదలికలు చాలా వేగంగా ఉంటాయి. అందువల్లనే పాముతో పోరాటం జరిగేటపుడు పాము కాటు నుంచి తప్పించుకోగలుగుతుంది.

బోట్ బిల్ హెరాన్ (Boat Billed Heron)

దీని ముక్కు నీలిరంగులో, చూడ్డానికి చిన్న పడవలా ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ఇది ఒంటరి పక్షి. మనుషులకు, ఇతర పక్షులకు దూరంగా ఉంటుంది.ఇవి ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలో, దక్షిణ మెక్సికో నుంచి బొలీవియా వరకూ; ఉత్తర అర్జెంటీనా లోనూ కనపడతాయి.

వీటి పిల్లలకు పుట్టుకనుంచే రెండు చిన్ని పళ్లు ఉంటాయి.పొట్ట, కాళ్లు గోధుమ రంగులో; రెక్కలు నీలి, నలుపు, బూడిదరంగుల్లో ఉంటాయి. నిలబడితే తోకభాగం కింది వరకూ ఉంటుంది.4.7 ఔన్సుల బరువు, 24 అంగుళాల పొడవు ఉంటాయి. నాలుగు వరకూ గుడ్లుపెడతాయి. ఇవి కీటకాలను, పురుగులను తింటాయి. ఎక్కువగా రాత్రిపూటే తిరుగుతుంటారయి.

నారాయణ పక్షి - (Black Crowned Night Heron)

ఇవి నీటి అడుగున ఉన్న జీవాలను కూడా మసకచీకట్లో చూడగలుగుతాయి.కప్పలు, చేపలు, కీటకాలని మాత్రమే కాకుండా చిన్న చిన్న పక్షుల్ని కూడా తింటాయి.


తల, వీపు నలుపు, నీలం రంగులలోను, రెక్కలు బూడిదరంగులో ఉంటాయి. కంఠం, పొట్టభాగం తెల్లగా ఉంటాయి.వీటి కళ్లు చాలా పెద్దవి.


సుమారు 1.5 ఔన్సుల బరువు, 26 అంగుళాల పొడవు ఉంటాయి.ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 3 నుంచి 5 గుడ్లు పెడతాయి. 25 సంవత్సరాలు జీవిస్తాయి.

Wednesday, January 2, 2013

ఆల్బట్రాస్ (Black browed Albatross)

సముద్రపక్షుల్లోకెల్లా పెద్దది ఆల్బట్రాస్. రెక్కలు ఆడించకుండా ఎంత దూరమైనా నీటిపై ఎగరగలవు.  ఇవి సబ్ అంటార్కిటికా, కేప్‌హార్న్, స్టాటన్ ఐలాండ్, కెర్‌గ్యూలెన్, హెర్డ్, దక్షిణ జార్జియా, క్యాంప్‌బెల్ దీవుల్లో, ఫాక్‌లాండ్‌లోనూ కనపడతాయి.  సముద్రం మీద ఈదురు గాలులు వీచుతున్నప్పటికీ వాటిపై స్వారీ చేస్తున్నట్టు ఎగరడం వీటి ప్రత్యేకత.  సముద్రతీరాల్లో పెంగ్విన్‌లతో, బూడిదరంగు ఆల్బట్రాస్‌లతో కలిసిమెలసి ఉంటాయి.  ఇవి ఎక్కువగా చేపలు, బురదపాముల్ని తింటాయి. వీటి జీవితకాలం 80 సంవత్సరాలు.

Sunday, December 30, 2012

కింగ్‌ఫిషర్ (Belted Kingfisher)


ఇవి అలస్కా, కెనడా, అమెరికా, మెక్సికో, వెస్టిండీస్, పనామా, మధ్య అమెరికా ప్రాంతాలలో కనపడతాయి. ఇది బాగా సోమరిగా ఉంటుంది.దీనికి నెత్తిమీద నల్లని ఈకలు పైకి దువ్వినట్లుంటాయి. మెడభాగం తెల్లని ఆభరణంగా, పొట్టమీద తెల్లని నల్లని చారలుంటాయి.

దీని రెక్కలు, తోక నీలం, బూడిద రంగుల మిశ్రమంలో ఉంటాయి. సూదంటి ముక్కుతో చేపల్ని ఠక్కున పట్టి చెట్టుమీదకి తెచ్చుకుని కొమ్మకి కొట్టి చంపి మరీ తింటుంది.

ఇది సుమారు 14 అంగుళాల పొడవు, 6 ఔన్సుల బరువు వుంటుంది. ఏప్రిల్, జూలై మాసాల్లో 8 వరకూ గుడ్లు పెడతాయి. ఎక్కువగా చేపలు, కప్పలు, పీతలు, బల్లులు, పాములు, కీటకాలు, ఇతర పక్షులను, ఎలుకల్ని తింటాయి.

ఆర్కిటిక్ టెర్న్ (Arctic Tern)

ఇది బలమైన పక్షి. చాలాదూరం వలస పోతుంది.ఎక్కువగా పగటిపూటే, అత్యంత ఎత్తు ఎగిరివస్తూంటుంది.కెనడా, ఆసియా, యూరప్‌లో పుట్టి, ఎక్కువకాలం దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కి టిక్ మంచు ముద్దపైనా ఉంటుంది. వీటి ముక్కు చిన్నదిగా, సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. నెత్తి నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా ఉంటాయి.


ఇవి సుమారు 14 అంగుళాల పొడవుంటాయి. రెక్కలు సుమారు 34 అంగుళాలు విస్తరిస్తాయి.

మే, ఆగస్టు మాసాల్లో 3 గుడ్లుపెడతాయి. చేపలు, బురదపాములు, కీటకాలను తింటాయి.

ఇవి సుమారు 3, 4 ఏళ్లు బతుకుతాయి.

Monday, December 24, 2012

చుక్కల హైనా (Spotted Hyena)

ఇది మాంసాహారి. దీనిని లాఫింగ్ హైనా అని కూడా అంటారు.ఇవి ఎంతో తెలివిగలవి. గుంపులుగా నివసిస్తాయి.ఇవి కొంతదూరం వరకు దూకగలవు కాని, వేగంగా నడవలేవు. మగ హైనాలు 55 కేజీల బరువు, ఆడహైనాలు సుమారు 60 కేజీల బరువు ఉంటాయి. ఇవి పెద్దవయ్యేకొద్దీ శరీరంపై మచ్చలు పోతూంటాయి.


సింహం వేటాడి వదిలేసిన మాంసాన్నే తింటాయి. చేపలు, తాబేళ్లను వేటాడతాయి.గుహలాంటి ప్రదేశంలో ఉండి రహస్యంగా దాడి చేస్తాయి. సంతతిలో... ఆడవాటిని మాట్రియాక్ అంటారు.ఆడ హైనాలే నాయకత్వం వహిస్తాయి.