షాక్‌కు గురైన వాళ్లను పొరపాటున కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే
వారి నుంచి కరెంటు మనలోకి కూడా పాసయ్యే ప్రమాదం ఉంది.
ఏదైనా కర్రతో గానీ, చెక్కతో గానీ కొట్టి కరెంట్ ఫ్లో అవుతున్న వైర్‌నుంచి బాధితుడిని వేరు చేయాలి.
వెంటనే పల్స్ చూడాలి. పల్స్ అందకపోతే, కార్డియో పల్మునరీ రిససియేషన్
(సీపీఆర్) చేయాలి. అంటే... నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని
ఊపిరితిత్తుల్లోకి పంపాలి. గుండె స్పందనలు ఆగిపోతే రెండంగుళాల లోతుగా
ప్రభావం పడేట్లు ఛాతీపైన చేతులతో ప్రెషర్ ఇవ్వాలి.
ఎలక్ట్రిక్
షాక్ వల్ల ఒళ్లు కాలితే (ఎలక్ట్రిక్ బర్న్స్), డాక్టర్ని అడక్కుండా మామూలు
ఆయింట్‌మెంట్స్‌గాని, పూతమందులు గాని వాటికి రాయకూడదు.
ఎలక్ట్రిక్ షాక్‌కు గురైనవారు అకస్మాత్తుగా కింద పడిపోతే, వాళ్లని ఎక్కువ కదిలించకూడదు.
షాక్‌కు గురైన వారికి గుండె స్పందనల్లో తేడా రావడాన్ని వెంట్రిక్యులార్
అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించడం సాధ్యం. కాబట్టి
వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.
0 comments:
Post a Comment