మనకి గోళ్లు పెరుగుతున్నట్టే ఎలుకలకు ముందు పళ్లు పదునుగా పెరుగుతూ
ఉంటాయి. మనం గోళ్లను కత్తిరించుకున్నట్టే, ఎలుకలు పళ్లను కత్తిరించుకోవాలి
కదా? అందుకే అవి ఆకలిగా ఉన్నా లేకున్నా ఏదో ఒక వస్తువును కొరుకుతూ ఉంటాయి.
అంటే వాటి పళ్లను ఎప్పటికప్పుడు అరగదీసుకుంటాయన్నమాట.
ఎలుకల్లాంటి ప్రాణులు కొంతకాలంపాటు ఏ వస్తువునూ కొరక్కుండా ఉంటే పళ్లు పెరిగిపోయి నోరు
నిత్యం తెరిచి ఉంచాల్సి వచ్చేది. అందుకే అవి ఎంతో బలమైన సిమెంటు, ఇనుప
వస్తువులు, స్థంభాలను కూడా కొరకడానికి ప్రయత్నిస్తుంటాయి. అంతేగాని అవి
తెలివితక్కువ జంతువులేమీ కావు!
0 comments:
Post a Comment