సముద్రపు
నీటిలో ఉప్పు బాగా ఉండే కారణంగా ఆ నీటిని మనం తాగలేం. ఒకవేళ తాగినా మన
శరీరం తట్టుకోలేదు. అందుకే ఎవరైనా పొరపాటున కొంచెం సముద్రపు నీటిని
తాగినప్పుడు ఆ నీటి సాంద్రత తగ్గేందుకు చాలా ఎక్కువగా మంచినీటిని
తాగిస్తారు. అలాంటపుడు సముద్రంలోనే ఉండే జీవాల మాటేమిటి?
ఇతర
జీవాల్లో ఉండే మాంసం, నీరు వాటి శరీర అవసరాలని తీరుస్తాయన్నమాట. అయితే
ఆహారాన్ని మింగేటపుడు శరీరంలోకి ప్రవేశించే ఉప్పును వదిలించుకునేందుకు
మాత్రం వేర్వేరు జీవుల్లో వేర్వేరు ఏర్పాట్లు కనపడతాయి. ఉదాహరణకు మొసళ్ళ,
తాబేళ్లు, కొన్నిరకాల పాముల్లో అవి కార్చే కన్నీటి ద్వారా వాటి శరీరంలోని
అదనపు ఉప్పు బయటకు పోతుంది.
0 comments:
Post a Comment