ఇవి ఆఫ్రికా, యూరప్, దక్షిణ ఆసియా, ఐలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో
ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకోగలవు.
శత్రువుల నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు గూటిలోని పిల్లలను శబ్దాలతో హెచ్చరిస్తాయి.
దీని ముక్కు నారింజరంగులో సూదిగా ఉంటుంది. కంటి చుట్టూ పచ్చని రింగులా
ఉంటుంది. మిగతా శరీరమంతా నల్లని ఈకలు కలిగి ఉంటుంది. వీటిలో ఆడపక్షులకు
బూడిదరంగు ఈకలు ఉంటాయి.
ఇవి సుమారు 10 అంగుళాల పొడవు, 4 ఔన్సులు
బరువు ఉంటాయి. ఎక్కువగా వానపాములు, పురుగులు, పండ్లను తింటాయి. ఇవి
చలికాలంలో అనువైన ప్రదేశాలకు వలసవెళ్లి తమ సంఖ్య పెంచుకుంటాయి.
0 comments:
Post a Comment