కాయలు కాసే లేదా కంకులు వేసే ప్రతి చెట్టు నుంచి అనేక గింజలు ఉత్పత్తి
అవుతుండటం, వాటిలో దాదాపు అన్నీ తిరిగి అలాంటి మొక్కగా పుట్టగలిగే
శక్తిసామర్థ్యాలను కలిగి ఉండటం సహజం. అయితే ఒక చెట్టు నుంచి పుష్కలంగా
గింజలు వచ్చినా అందులో ఒక్కటి కూడా తిరిగి మొక్కగా పుట్టడానికి
పనికిరాకపోతే ఏమవుతుంది?
అంతకు ముందు ఆ గింజల్ని అమ్మిన కంపెనీ
నుంచే వాటి విత్తనాలను మళ్ల్లీ కొనాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని
కల్పించేవే టెర్మినేటర్ విత్తనాలు. ఇవి కొన్ని కంపెనీల ఆధ్వర్యంలో కొందరు
శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాలు. వీటిని మన పొలంలో
వేసుకుంటే పంట దిగుబడి అధికం కావచ్చు.
ఆయా కంపెనీలవారు చె
బుతున్నట్టు ఈ మొక్కలు పీడలను సమర్థంగా తట్టుకోవచ్చు. కానీ రెండోసారి
వేయాలంటే మాత్రం మళ్లీ ఆ కంపెనీవే వేయాలి. మనకంటూ ఎలాంటి విత్తనాలూ
లేకపోవడం వల్ల కొంతకాలానికి వ్యవసాయం కోసం ఆయా కంపెనీల మీదే తప్పక
ఆధారపడాల్సివస్తుంది. అందుకే టెర్మినేటర్ విత్తనాల పట్ల రైతాంగం ఆసక్తి
చూపట్లేదు.
0 comments:
Post a Comment