క్లోరోఫిల్
కారణంగా అనేక చెట్ల ఆకులు ఆకుపచ్చగా ఉన్నట్టుగానే అరటిపళ్ళు కాయల రూపంలో
ఉన్నపుడు వాటి తొక్క ఆకుపచ్చగానే ఉంటుంది. ఇవి పండినపుడు వాటిలోని
క్లోరోఫిల్ విచ్ఛిన్నమై పసుపురంగు కనపడటం మొదలవుతుంది. ఈ మార్పు సమయంలో
అప్పటివరకూ ఉన్న పిండిపదార్థాలు చక్కెరగా మారతాయి. పెక్టిన్ అనబడే
పిండిపదార్థం విచ్ఛిన్నమై, పండు తాలూకు గుజ్జు మెత్తబడుతుంది.
శిశిరరుతువులో చెట్ల ఆకులు పసుపురంగులోకి మారడానికి కూడా ఆయా ఆకుల్లోని
క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడమే ప్రధానకారణం.
0 comments:
Post a Comment