గాజుతొట్టెల్లో చాలామంది చేపల్ని పెంచుతుంటారు. దీన్నే అక్వేరియం అంటారు. ఇలా చేపల్ని పెంచడానికి కొన్ని అంశాలు తెలియాలి.
అక్వేరియంలో పెంచేందుకు గోల్డ్‌ఫిష్, గప్పీస్ వంటి కొన్నిరకాల చేపలను
మాత్రమే పెంచగలం. వాటికి ప్రత్యేక ఆహారాన్ని ఇవ్వాలి. పదినిమిషాల్లో
తినగలిగినంత మాత్రమే పెట్టాలి. అక్వేరియమ్‌ను సురక్షితస్థానంలో నేరుగా
ఎండతగలని చోట ఉంచాలి. తొట్టెకి ఎండ తగిలితే అందులో నాచు పెరిగే అవకాశం
ఉంది.
ఈ కారణంగా తొట్టెలోని నీటి ఉష్ణోగ్రత ఉండాల్సినదానికంటే
పెరిగిపోతుంది. అక్వేరియంపై గాజు లేదా ప్లాస్టిక్‌మూతను పెట్టడం మంచిది.
ఇది నీటి ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది. నీటిని మార్చడం గురించి అక్వేరియం
అమ్మే దుకాణాల వారితో సంప్రదించడం మంచిది.
0 comments:
Post a Comment