టీవీని
ఆన్ చేయగానే పిల్లలు ముందు ముందుకు వచ్చి చూస్తుంటారు. అది ఆ కార్యక్రమాల
పట్ల ఆసక్తి కావచ్చు. టీవీని తగిన దూరం నుంచి చూడాలని డాక్టర్లు
చెబుతుంటారు. అంటే ఎంత దూరం అనే ప్రశ్న వస్తుంది. మీ ఇంట్లో టీవీ స్క్రీన్
సైజు ఎంతో గమనించి, దానికి నాలుగింతల దూరంలో కూర్చుని చూడటం మంచిదంటున్నారు
డాక్టర్లు. ఏ టీవీ అయినా కనీసం 8 అడుగుల దూరం నుంచి చూడటం మంచిది.
టీవీకి సంబంధించిన రెజల్యూషన్ ఎంత ఎక్కువగా వుంటే అందులో కనిపించే చిత్రం
నాణ్యత కూడా అంత మెరుగ్గా వుంటుంది. టీవీ తెరమీద మనకు కనిపించే ప్రతి
చిత్రం అనేక వేల చిన్న చిన్న రంగురంగుల చుక్కలతో రూపొందుతుంది. వీటినే
పిక్సెల్స్ అంటారు. మనకు సరిగా లేదని, గదిలో వెలుగు తక్కువగా ఉందని టీవీ
లైటింగ్ పెంచుతుంటారు. ఇది కళ్లకు ఏమాత్రం మంచిది కాదు.
0 comments:
Post a Comment