
భూమి
నుంచి చూసేవారికి చంద్రబింబం కొంచెం వెనక్కి, ముందుకు ఊగిసలాడుతున్నట్టు
ఉంటుంది. అందుకే చంద్రుడు కనిపించేది ఒకే భాగమయినా, అందులోనే ఒకింత తేడా
కనపడుతుంది. దీనికి రెండుకారణాలున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఒక
సరయిన వృత్తాకార మార్గంలో కాదు. అంటే కొంచెం సాగదీసిన వలయాకారంగా ఉంటుంది.
కనుకనే తిరిగే వేగం, దూరాన్ని బట్టి, చుట్టూ తిరిగే వేగం కంటే కొంచెం
ముందుకు, వెనక్కీ ఉంటుంది.
0 comments:
Post a Comment