మన ఇళ్లల్లోని ఐరన్‌బాక్స్, సైకిళ్లకి తుప్పు పట్టడం చూసే ఉంటారు. ఇనుము
తప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు, గాలిలోని నీటి
ఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము
నీటిలోని ఆక్సిజన్‌ను తీసేసుకుని హైడ్రోజన్‌ను వదిలేస్తుంది. ఇనుము,
ఆక్సిజన్ రెండూ కలిసి ఫై ఆక్సైడ్(తుప్పు) తయారై ఇనుముపై పేరుకుపోతుంది.
తుప్పు పొడిపొడిగా ఉండి మిగిలిన ఇనుముతో సంబంధం కలిగి ఉండదు. దాంతో రాలి
కిందపడిపోతుంది.
తుప్పుపట్టిన వస్తువు బరువు క్రమేపీ తగ్గుతూ
కొన్ని రోజులకు అది మొత్తం విడిపోతుంది. దీనివల్లనే ఇనుప వస్తువులకు తుప్పు
పట్టకుండా పెయింట్, నూనె, గ్రీజు వంటివి పూస్తారు. ఇవి ఇనుముకు, నీరు,
నీటి ఆవిరికి మధ్యన ఉండి ఇనుము ఆక్సిజన్ కలవకుండా చేస్తాయి.
0 comments:
Post a Comment