Pages

Tuesday, January 8, 2013

సింగినాదం జీలకర్ర...ఏమిటి...

అప్పట్లో జీలకర్ర వర్తకులు కాలువలో పడవల మీద వెళ్తూ, ఏదైనా ఊరు వచ్చినప్పుడు శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారట! అది విని జనం జీలకర్ర కొనుక్కోడానికి వెళ్లేవారట. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకోవడం మొదలుపెట్టారు.


అలా శృంగనాదానికీ జీలకర్రకీ సంబంధం ఏర్పడింది. నోరు తిరగని కొందరు శృంగనాదాన్ని సింగినాదం చేశారు. అబద్ధాన్ని నిజమనుకుని వెళ్లి జనం మోసపోవడం వల్ల, ఏదైనా విషయం నిజమో అబద్ధమో తెలియనప్పుడు సింగినాదం జీలకర్రేం కాదూ అనడం మొదలుపెట్టారు. అదే ఇప్పటికీ వాడుకలో ఉంది.

No comments:

Post a Comment