పెయిన్
కిల్లర్స్‌తో కలిగే దుష్ర్పభావాలపై చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే
చిన్న నొప్పి ఉన్నా చీటికీ మాటికీ పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు. నొప్పి
తగ్గే విషయంలో ఇవి సత్వరం పనిచేసినా, దీర్ఘకాలంలో అవి చూపించే
సైడ్‌ఎఫెక్ట్స్ మీద మీ అవగాహన ఏమిటో చెక్ చేసుకోండి.
1.పెయిన్ కిల్లర్స్ మూడు వారాలకు మించి వాడితే అవి కడుపు లోపలి పొరలను, రక్తనాళాల్లోని లోపలి పొరలను దెబ్బతీస్తాయి.
ఎ. అవును బి. కాదు
2.చాలామందిలో అవి మూత్రపిండాలపై దుష్ర్పభావం చూపి, నెఫ్రోపతి అనే కండిషన్‌కు దారితీస్తాయి.
ఎ. అవును బి. కాదు
3.రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌ని దెబ్బతీసి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు.
ఎ. అవును బి. కాదు
4.పెయిన్ కిల్లర్స్‌ను తప్పనిసరిగా ఏదైనా తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి.
ఎ. అవును బి. కాదు
5.అవి వేసుకున్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
ఎ. అవును బి. కాదు
పై వాటిల్లో మూడింటికంటే ఎక్కువ అంశాలకు మీ సమాధానం ‘అవును’ అయితే మీకు
పెయిన్‌కిల్లర్స్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ప్‌పై మంచి అవగాహన ఉన్నట్లే.
No comments:
Post a Comment