కాకులు సంఘజీవులు
ప్రపంచంలోని పక్షులన్నింటిలోకి కాకులు చాలా తెలివైనవి శాస్తజ్ఞులు
చెబుతున్నారు. అడ్డమైనవీ తింటాయని కాకుల్ని కొందరు అసహ్యించుకున్నా,
మరికొందరు వాటిని అపశకునంగా భావించినా కాకుల వల్ల పంటపొలాలకు,
పర్యావరణానికీ చాలా మేలు జరుగుతుంది. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను
తినడం ద్వారా అవి రైతులకు మేలు చేస్తే, ఊళ్ళలోని చెత్తాచెదారంలోని
పురుగుల్ని, పదార్థాల్ని తినడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు
తోడ్పడుతున్నాయి.
కాకులు సంఘజీవులు. అవి కేవలం తమ కుటుంబానికి
చెందిన కాకులకేగాక, అవసరమైనప్పుడు ఇతర కుటుంబాలకు చెందిన కాకులకూ సాయం
చేస్తాయి. గుంపులుగా జీవించే అనేక ఇతర పక్షుల్లోనూ, పిల్లులు, కుక్కలు వంటి
జంతువుల్లో కూడా ఈ తరహా ప్రవర్తన మనకు కనిపించదు.
కాకులు
తెలివిగా, సంతోషంగా జీవించడమే కాదు, అవసరమైనప్పుడు కట్టెపుల్లల్ని తమకు
కావలసిన రీతిలో మలచుకొని వాటిని ‘సాధనాలుగా’ ఉపయోగిస్తాయని శాస్త్రజ్ఞులు
కనుగొన్నారు. నిజంగానే, కాకులు చాలా తెలివైనవి కదా! అంతేకాదు, వాటికి
జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువేనట.
0 comments:
Post a Comment