
ఆకారంలో చిన్నగా ఉండే జీవుల తాలూకు శరీర ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం
కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా భూమి యెక్క గురుత్వాకర్షణశక్తి
వాటిపై చూపించే ప్రభావంకన్నా గాలిలాంటివి వాటి ఉపరితలంపై చూపించే ప్రభావం
సాపేక్షికంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. దాంతో ఏదైనా ఒక ఎత్తై...