దీన్ని నేర్చుకోవడం అంత సులభం కాదు. కేవలం రెండున్నర అడుగుల ఉండే ఈ చిన్న
వాద్యపరికరాన్ని ఫిడేలు వలె కమానుతో వాయిస్తారు. అయితే దీని కమాను బాణంలా
ఉంటుంది. ఈ కమానుకు కూడా గుర్రపు తోక వెంట్రుకలు తీగెలుగా ఉంటాయి.
సారంగిని నల్లకొయ్యతో తయారుచేస్తారు. చూడ్డానికి రెండున్నర అడుగుల
పెట్టెలా ఉంటుంది. దీని వెడల్పు ఆరు అంగుళాలు ఉంటుంది. కొన్ని కాస్తంత
పెద్దవి కూడా ఉన్నాయి. సారంగి కింది భాగం లోపల ఖాళీగా ఉంటుంది.
దీనివల్ల శబ్దం వీనులవిందుగా ప్రతిస్పందిస్తుంటుంది. దీనికి పల్చని
మేకచర్మం తొడుగు ఉంటుంది. సారంగి చివరిభాగం గిటార్‌కివలె పైకి వొంపు
ఉంటుంది. అక్కడి నుంచి తలభాగానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు తీగెలు
ఉంటాయి. ఇవేగాకుండా మరో 35 తీగెలు ఉంటాయి.
దండానికి ఎడమభాగం పక్కన 12 మీటలు, సారంగి చివర రెండువైపులా నాలుగేసి మీటలు ఉంటాయి.
విద్వాంసుడు బాణంవంటి కమానుతో ప్రధాన ఆరుతీగెలమీదా వాయిస్తున్నపుడు
రాగాన్ని అనుసరించి మీటలు సవరించినపుడు మిగతా తీగెలు సహకరించి
వీనులవిందుచేస్తాయి.
సారంగిపై కొన్ని ప్రత్యేక రాగాలు మరింత వినసొంపుగా ఉంటాయి. దీన్ని వాయించడంలో ఎన్నో ప్రత్యేకతలు పాటించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment