తబలా అన్న పేరు అరబ్బీ భాషా పదమైన తబ్ల్ (డ్)్ర నుంచి ఉద్భవించింది.
దీనిని రెండు చేతులతోనూ వాయిస్తారు. తబలా లేదా తబ్లా భారత శాస్త్రీయ
సంగీతానికి చెందిన వాద్యం. ఇది భారత ఉపఖండంలో ప్రఖ్యాతి గాంచింది.
ప్రత్యేకించి హిందూస్థానీ సంగీతంలో ప్రత్యేకస్థానం. ఈ వాద్యం చేతితో వాయించే జతడ్రమ్ములు కలిగి ఉంటుంది.
ఈ డ్రమ్ములు చెక్కతోను, వీటి పైభాగం గొర్రెతోలుతోనూ తయారవుతాయి. ఈ రెండు
డ్రమ్ములు వేర్వేరు సైజుల్లో ఉంటాయి.తబలా వాయించడంలో ఒక ఘరానా లేదా
పాఠశాలకు చెందిన పండితుడు లేదా విద్వాంసుడిని ఉస్తాద్ అంటారు.
తబలా పైనుండే నలుపురంగు వృత్తాకారాన్ని స్యాహీ అంటారు. దీనికి గాబ్ అని
కూడా పేరుంది. ఇది తబలా యొక్క శీర్షభాగం. దీనిని ష్యానీ అని కూడా అంటారు.
తబలాకు ప్రపంచ ప్రసిద్ధ గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు జకీర్ హుసేన్, ఉస్తాద్ అలారఖా, త్రిలోక్ గుప్తా మొదలైన వారు.
No comments:
Post a Comment