సింగినాదం లేదా సింహనాదం ఒక సుషిర వాద్యం. బాకాను పోలి ఉంటుంది. పెద్ద
ధ్వనులు చేయడానికి ఉపయోగపడే వాద్యం. దీని మొదలు సన్నగాను, చివర వెడల్పుగాను
ఉంటుంది. ఈ వాద్యం ద్వారా అనేక ధ్వనులను సృష్టిస్తారు.
పూర్వం వర్తకులు ఆంధ్రప్రాంతానికి వచ్చినపుడు తమ రాకను తెలుపుతూ పెద్ద పెద్ద బర్రె కొమ్ములతో ఊదేవారట.
పెద్ద పెద్ద ధ్వనులు రావడం వల్ల వీటిని సింహనాదాలుగా వ్యవహరించి ఉండవచ్చు.
అదే సింగినాదంగా రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు.
రామానుజ మతస్థులు తమ వైష్ణవ గురువుల రాకను సూచించేందుకు ఈ వాద్యాన్ని ఉపయోగించేవారట.
No comments:
Post a Comment