ఆకాశంలో మేఘాలు వ్యాకోచించటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. మేఘాలలోని నీటి
ఆవిరి ద్రవీకరణ చెంది చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. దాన్నే మనం వర్షం
అంటాం. అయితే వ్యాకోచం చెందే మేఘాలు సెకనుకు 1నుంచి 10 మీటర్ల వేగంతో పైకి
పోతూ ఉంటాయి. ఇలా పైకి పోయే మేఘాలతోపాటు చిన్న చిన్న బిందువులు కూడా పైకి
వెళ్తున్నప్పుడు వాటికి మరికొన్ని నీటి బిందువులు తోడయి పెద్ద బిందువుగా
మారుతుంది.
ఇలా బరువెక్కిన నీటి బిందువు పైకి వెళ్లలేక
భూమ్యాకర్షణ శక్తి కారణంగా కిందికి పడుతుంది. అంతేకాక స్వల్ప పరిమాణంలోని
నీటి బిందువు గోళాకార రూపాన్ని పొందుతుంది. గాలిలోని నీటి ఆవిరి నీటి
బిందువుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరిగేది కాబట్టి వర్షం బిందువులుగానే
పడుతుంది. అయితే అల్ప పీడనం ఏర్పడినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎక్కువ నీటి
ఆవిరి ద్రవీకరణ చెందడం వలన నీటి బిందువులు ఒక దాని వెంట మరొకటి పడుతూ వర్షం
ధారలాగా కన్పిస్తుంది. దీనినే మనం కుండ పోత వర్షం అంటాం.
No comments:
Post a Comment