మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి... ఏం
జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం
జరగదు. అంటే... మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు... అసలు కదలడమే
సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు
అర్థం కాదు కూడా! ఎందుకంటే... మెదడులోని కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్
కావాల్సిందే.
పైగా రక్తపోటును క్రమబద్ధీకరించే గుణం దీనికి ఉంది.
మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో
తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా.
పొటాషియమ్ ఉంటుంది. ఒక అవకాడోలో 500 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. కానీ ఇది
అందరికీ అంతగా అందుబాటులో ఉండదు. ఇక పై రెండూ అందుబాటులో లేకపోతే పొటాషియమ్
కోసం బంగాళాదుంప (ఆలుగడ్డ) మీద ఆధారపడండి. ఒక పెద్ద ఆలుగడ్డలో 1600
మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది.
No comments:
Post a Comment