గాజుసీసాలో
పలు రకాల బొమ్మలు అమర్చి కళాకృతులుగా అమ్ముతుంటారు. వాటిలో ఓడలు, పడవలు,
కట్టడాలు మనుషుల బొమ్మలు వంటివీ ఉంటాయి. అసలు సీసాలో బొమ్మల్ని ఎలా
అమరుస్తారన్నదే ఆశ్చర్యపరుస్తుంది.
దీనికి ప్రత్యేకించి
పుల్‌థ్రెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అంటే బొమ్మను అనేక మడతలుగా
రూపొందిస్తారు. చిన్న దారం లాగితే ఆ బొమ్మ విచ్చుకుంటుంది. బొమ్మను
సీసాలోకి పెట్టి ఈ దారాన్ని మెల్లగా లాగితే లోపల అమర్చిన బొమ్మ విచ్చుకుని
పెద్దదవుతుంది. ఇప్పుడు మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడంతో వీటి
తయారీలో కొత్తపద్ధతుల్ని వాడుతున్నారు. సన్నని మూతిగల సీసాలోకి అంతపెద్ద
వస్తువులు ఇమడటం కష్టమే. కానీ చేసి చూపుతున్నారు.
No comments:
Post a Comment