వస్తువు పగిలినప్పడు వచ్చే శబ్దాల్లో తేడాలు ఎందుకు?
వస్తువులు
పగిలినపుడు వచ్చే శబ్దాల్లో తేడాలు ఉంటాయి. వాటికి అనేక కారణాలుంటాయి.
గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చలించినపుడు రకరకాల శబ్దాలు
ఉత్పన్నమవుతాయి. సైకిల్ ట్యూబ్ లేదా బెలూన్ పగిలినపుడు వాటిలో గాలి
హఠాత్తుగా బయటికి రావడంతో ‘పేలిన’ శబ్దం వస్తుంది.
అయితే
విద్యుత్ బల్బులో గాలి ఉండదు గనుక అది పగిలితే దాని చుట్టూ ఉన్న గాలి
ఒకేసారి దాని దిశగా దూసుకుపోవడం వల్ల ఢాం అని శ బ్దం వస్తుంది. విద్యుత్
బల్బు శూన్యంలో పగిలిపోతే, దాని చుట్టూ గాలి వుండని కారణంగా అప్పుడు ఎలాంటి
శబ్దమూ రాదు. నీటిలో పగిలినప్పుడు దాని దిశగా నీరు దూసుకుపోయే కారణంగా మరో
రకం శబ్దం వస్తుంది. ఆయా వస్తువుల ధర్మాలను బట్టి గాక, అవి పగిలేటపుడు
వచ్చే శబ్దాలలో మార్పు వస్తుందన్నమాట. పాలిథిన్ కవర్లలో గాలిని, నీటిని
నింపి పగలగొడితే వచ్చే శబ్దంలో తేడాను గమనించే ఉంటారు.
No comments:
Post a Comment