STEP UP MODEL BILLS
STEPUP AND PREPONEMENT CLARIFICATIONS THROUGH QUESTIONS AND ANSWERS
STEP UP GO.93 DATED 3/4/10-CLICK HERE
MEMO ON POWERS DELEGATED ON STEPUP FOR TEACHERS
Memo No.5465 - STEPPING UP OF PAY OF SENIOR ON PAR WITH JUNIOR AFTER AVAILING AAS
DOWNLOAD THE FULL COPY OF STEP UP DETAILS IN TELUGU-CLICK HERE
STEP UP CHECK LIST-CLICK HERE
READ THE EXTRACT OF GO.93 DATED 03/04/2010 ON STEP UP
నియమనిబంధనలు :
9వ వేతన సవరణ సంఘం చేసిన సానుకూలమైన సిఫారసులలో ముఖ్యమైనది స్టెప్‌అప్, ప్రీపొన్‌మెంట్ ఆఫ్ ఇంక్రిమెంటు సౌకర్యాలను పునరుద్ధరించటం. ఆర్‌పిఎస్-93కి ముందు ఇవి అమలులో ఉన్నాయి. 31.07.93 నుండి (93,98,2005 పీఆర్‌సీలలో) వీటి అమలును నిలిపి వేశారు. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాల వల్ల పలువురు సీనియర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నష్టం జరిగింది. ఈ నష్టాలను 9వ వేతన సవరణ కమీషన్ దృష్టికి తీసుకువచ్చి, స్టెప్‌అప్, ప్రీపోన్‌మెంటు సౌకర్యాలను పునరుద్ధరించాలని యుటియఫ్ చేసిన వాదనను అంగీకరించిన పీఆర్‌సీ ఆసౌకర్యాలను పునరుద్ధ-రించింది.అంతే కాకుండా గత పీఆర్‌సీలలో ఏర్పడిన అసమానతలను సవరించిన అనంతరమే 2010 వేతన స్థిరీకరణ నిర్వహించాలని సిఫారసు చేసింది. 17 ఏళ్ళ అనంతరం పునరుజ్జీవం పొందిన స్టెప్‌అప్, ప్రీపోన్‌మెంటు ఆఫ్ ఇంక్రిమెంట్ గురించి తెలుసుకుందాము..
స్టెప్ అప్:
సీనియర్ ఉపాధ్యాయులు తన కంటే జూనియర్ అయిన ఉపాధ్యాయుని కంటే తక్కువ వేతనము పొందుతుంటే అట్టి వ్యత్యాసమును ఎఫ్‌ఆర్ 27 ప్రకారం సవరించబడుటను స్టెప్‌అప్ అంటారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో 10-15 సంవత్సరాల స్కేళ్ళ అమలు వలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నం. 297 ఆర్థిక & ప్రణాళిక, తేది. 25.10.1983 ద్వారా స్టెప్‌అప్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఎఎఎస్‌లో 10/15/22 సం||ల స్కేళ్ళ అమలు, పదోన్నతి సందర్భములో ఎఫ్‌ఆర్ 22(బి) అమలు తదితర కారణాలవలన వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నం. 75 ఆర్థిక & ప్రణాళికా శాఖ, తేది. 22.02.94 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పై రెండు ఉత్తర్వులను ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్.నం. 475 విద్య, తేది. 02.11.98 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

పై ఉత్తర్వులు 93 పీఆర్‌సీ స్కేళ్ళ అమలుకు ముందు వరకు అనగా 31.07.93 వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి 93,99 పీఆర్‌సీల్లో ఎఎ స్కీము స్కేళ్ళు పొందినవారికి ఎఫ్‌ఆర్ 22బి ప్రయోజనం నిరాకరించబడి ఆర్‌పిఎస్ 2005లో పునరుద్ధరించ బడింది. ఆ కారణంగా ఏర్పడిన వేతన వ్యత్యాసాలను సవరించటానికి వీల్లేదని ప్రభుత్వం మెమో నం. 2620-ఎ/65/ఎఫ్‌ఆర్-11/07, తేదీ. 20.02.2007 ద్వారా ఆదేశించింది. అందువలన అనేకమంది సీనియర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ జూనియర్లకంటే తక్కువ వేతనం పొందుతున్నారు. అటువంటి వారందరికీ ఇప్పుడు ప్రయోజనం కలుగుతుంది. పైన పేర్కొన్న ప్రభుత్వ ఉత్తర్వులలో స్టెప్‌అప్ ఉత్తర్వులు అమలు చేయుటకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్ధేశించింది. ఈ నిబంధనల పరిధిలోనే స్టెప్‌అప్ అమలు చేయబడుతుంది.
నిబంధనలు :
1. సీనియర్, జూనియర్ ఉపాధ్యాయుని నియామకం ఒకే యూనిట్‌లో జరిగి ఉండాలి. అనగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌లలో పని చేసే వారికి అదే యూనిట్‌లో పని చేసే వారితో పోల్చుకోవాలి.
2. సీనియర్, జూనియర్‌లు ఒకే పే స్కేలు కలిగి ఉండాలి.
3. సీనియర్, జూనియర్‌లు ఇద్దరూ ఒకే పే స్కేలు, ఒకే సబ్జెక్టు మరియు ఒకే ప్రమోషన్ ఛానల్ కలిగిన కేటగిరీలోనికి పదోన్నతి పొంది ఉండాలి.
4. పదోన్నతి పొందుటకు ముందు క్రింది కేడరు పోస్టులో జూనియర్ యొక్క వేతనం సీనియర్ వేతనముకంటే తక్కువగా గాని లేక సమానముగా గాని ఉండాలి.
5. ఎఫ్‌ఆర్ 27 ప్రకారము సీనియర్ వేతనమును జూనియర్ వేతనముతో సమానము (స్టెప్‌అప్) చేసిన తదుపరి సీనియర్ ఉపాధ్యాయునికి వార్షిక ఇంక్రిమెంట్ స్టెప్‌అప్ జరిగిన తేదీనుండి ఒక సంవత్సరమునకు మంజూరు చేయబడుతుంది. ఒక వేళ జూనియర్ వేతనము ఎఫ్‌ఆర్ 31(2) ప్రకారం ఇంక్రిమెంటు తేదీకి రీ ఫిక్స్ చేయబడియుంటే సీనియర్ వేతనము కూడా అదే విధంగా సదరు తేదీకి జూనియర్‌తో సమానంగా స్టెప్‌అప్ చేయబడును.
6. సీనియర్ పదోన్నతి పొందిన తదుపరి జూనియర్ దిగువ క్యాడరులోనే 8/16/24 సం||ల స్కేలులో వేతన నిర్ణయం పొంది తదుపరి పదోన్నతి పొందిన సందర్భములో జూనియర్ వేతనముతో సీనియర్ వేతనం స్టెప్‌అప్ చేయబడును.
7. సీనియర్ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్‌ఆర్ 22(ఎ)(1) ప్రకారం వేతన నిర్ణయం జరిగి, జూనియర్ పదోన్నతి పొందినప్పుడు ఎఫ్‌ఆర్ 22బి ప్రకారం వేతన నిర్ణయం జరిగిన సందర్భములో వీరి వేతనంలో కలిగే అసమానతను స్టెప్‌అప్‌తో సరి చేస్తారు.
8. సీనియర్ వేతనముకంటే జూనియర్ వేతనము (ఎ) అదనపు అర్హతలకు మంజూరు చేయబడిన అదనపు ఇంక్రిమెంట్ల వల్ల కానీ (బి) కుటుంబ నియంత్రణ అమలుకు జారీ చేయబడిన వ్యక్తి గత వేతనము వలన గాని (సి) జూనియర్‌కు మంజూరు చేయబడిన ప్రొత్సహక ఇంక్రిమెంట్లు వలనగాని పెరిగినట్లైతే, వీరి వేతనములో వచ్చిన వ్యత్యాసమును ఈ ఉత్తర్వుల ప్రకారం స్టెప్‌అప్ చేయు అవకాశము లేదు.
9. పీఆర్‌సీ 2010 సిఫారసు మేరకు పీఆర్‌సీ అమలు తేది. 01.07.2008 నాటికి పై నిబంధనల మేరకు జూనియర్ ఉపాధ్యాయుని కంటే సీనియర్ ఉపాధ్యాయుడు తక్కువ వేతనం పొందుతుంటే ఆ తేడాను సవరించిన తదుపరి ఆర్‌పిఎస్ 2010 స్కేళ్ళలో వేతన నిర్ణయం చేయబడుతుంది.

ఉదాహరణ : 89 డిఎస్‌సిలో 17.07.89న 1010-1800/1010 వేతనంతో నియామకమైన ఏ,బి అనే ఇరువురు ఎస్‌జిటిలలో సెలక్షన్ లిస్ట్ ప్రకారం సీనియర్ అయిన (ఎ) అనే ఉపాధ్యాయుడు ప్రథమ నియామకం తేదీకే, బిఎస్సీ, బిఇడి (మాథ్స్) అర్హతలు కలిగి, ఎఎ స్కీములో 8 సం||ల స్కేలు తీసుకున్న అనంతరం 12.09.98న ఎస్‌ఏ (మాథ్స్) ప్రమోషన్ పొందినందున ఎఫ్‌ఆర్ 22 (బి)(రి) ప్రకారం వేతనం స్థిరీకరణ జరిగింది. (బి) అనే ఉపాధ్యాయుడు ఇంటర్, టిటిసి అర్హతలతో ఉద్యోగంలో చేరి తరువాత కాలంలో బిఎస్సీ, బిఇడి అర్హతలు సంపాదించి, 8/16 సం||ల స్కేళ్ళు తీసుకున్న అనంతరం 1.03.2006న స్కూల్ అసిస్టెంట్ మాథ్స్‌గా ప్రమోషన్ పొందాడు. అతని వేతనం ఎఫ్‌ఆర్ 22 బి ప్రకారం స్థిరీకరించ బడింది. ఆ కారణంగా (బి) అనే ఉపాధ్యాయుడు (ఎ) కంటే 1 లేదా 2 ఇంక్రిమెంట్లు అదనంగా వేతనం పొందే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో (ఎ) వేతనాన్ని (బి)కి ప్రమోషన్ పోస్టులో వేతన స్థిరీకరణ జరిగిన (1.03.06 / 01.07.06) తేదీ నాడు స్టెప్‌అప్ ద్వారా సమానం చేస్తారు. ఆ తదుపరి ఒక సంవత్సరం తర్వాత వార్షిక ఇంక్రిమెంటు ఇస్తారు. అటు పిమ్మట 01.07.08 నాటి వేతనం ఆధారంగా ఆర్‌పిఎస్ 2010లో వేతన స్థిరీకరణ జరుగుతుంది.
No comments:
Post a Comment