మెదడు చురుగ్గా ఉండాలంటే...
మన
శరీరంలో పనిచేసే కొద్దీ చురుగ్గా ఉండేది మెదడే. శరీరంలో జరిగే వివిధ
పనులను నిరంతరం నియంత్రించే మన మెదడుకి ఆఖరికి మనం నిద్రపోయేటపుడు కూడా
కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. అందుకే మన శరీరంలోని రక్తంలో 20 శాతాన్ని,
ఆక్సిజన్‌లో 20 శాతాన్ని ఒక్క మెదడే ఉపయోగించుకుంటుంది.
మన
మెదడులో 20వేల కోట్ల నాడీకణాలతోసహా మొత్తం లక్ష మైళ్ల పొడవుండే
రక్తనాళాలుంటాయి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో సహా అనేక ముఖ్యమైన
పనులను చేసే మెదడు నిరంతరం చురుగ్గా ఉండాలి.
అందుకు మనం బలమైన
ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ తగినంత పనిచేయాలి. సరైన వ్యాయామం చేయాలి.
తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. వివిధ రకాల పజిల్స్
పరిష్కరించడం, కొత్తవిద్యలు నేర్చకోవడం, ఆలోచించడం, రాయడం వంటివన్నీ
మెదడును ఉత్తేజపరిచి చురుగ్గా ఉంచుతాయి.
No comments:
Post a Comment