వెంట్రుకలు నల్లగా ఎందుకుంటాయి?
ప్రాంతం, వాతావరణ పరిస్థితులను అనుసరించి మానవుల వెంట్రుకల రంగులో
తేడాలుంటాయి. ఉష్ణ ప్రాంతాల్లో నివసించేవారి వెంట్రుకలు సాధారణంగా నల్లగానే
ఉంటాయి. ఇది ఒక విధంగా వరం. నల్లని రంగు వేడిమిని చక్కగా గ్రహించడమే గాక
సులభంగా వదిలిపెడతాయి కూడ.
ఈ ఏర్పాటు ఉష్ణప్రాంతాల్లో నివ
సించేవారికే వీలుంటుంది. ఇక వెంట్రుకలు నల్లగా ఉండడానికి కారణం మెలనిన్ అనే
పదార్థం. అది లోపిస్తే మాత్రం నల్లరంగు పోతూంటుంది. వెంట్రుకలు వృద్ధాప్యం
కారణంగానే తెల్లబడతాయని లేదు. చిన్నవయసులోనే తీవ్రమానసిక ఒత్తిళ్లు,
ఆందోళనకు గురయ్యేవారి తలవెంట్రుకలు తెల్లబడటం గమనించవచ్చు. అంతేగాకుండా
శరీరతత్వం, జీవనశైలి కూడా అందుకు కొంత కారణమవుతాయి.
No comments:
Post a Comment