సముద్రతీరాల్లో రకరకాల గవ్వలు దొరుకుతుంటాయి. వాటిని ఏరుకోవడంలో పిల్లలు పోటీపడుతుంటారు. వాటితో ఆడుకోవడం అదో సరదా. ఇవి రకరకాల ఆకృతుల్లో కనపడతాయి. ఉదాహరణకు రెక్కలు, తలపాగాలు, దారపు కండెలు, బొంగరాలు, తులిప్ పువ్వులు, శంఖాలు.
గవ్వలు అతి మెత్తని శరీరం ఉండే కొన్ని జాతులకు చెందిన జీవులను చలి నుంచి శత్రువుల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన గట్టి నిర్మాణాలు. ఒక విధంగా ఆ కవచాలు వాటిలోని జీవులకు ఒక ఇల్లుగా కూడా ఉపయోగపడతాయి. గవ్వ పెంకులపై ఉండే వలయాలు సాధారణంగా సవ్యదిశలోనే వుంటూ, వాటి ముఖభాగం కుడివైపు తెరచుకుని ఉంటాయి. చాలా అరుదుగా ఒకే జాతికి చెందిన కొన్ని లక్షలు లేదా కోట్ల గవ్వల్లో ఒకటి చొప్పున వాటి వలయాలు అపసవ్య దిశలో కొనసాగి వాటి ముఖభాగం ఎడమవైపు ఉంటుంది.
No comments:
Post a Comment