ఆర్కిటిక్ టెర్న్ (Arctic Tern)
ఇది
బలమైన పక్షి. చాలాదూరం వలస పోతుంది.ఎక్కువగా పగటిపూటే, అత్యంత ఎత్తు
ఎగిరివస్తూంటుంది.కెనడా, ఆసియా, యూరప్‌లో పుట్టి, ఎక్కువకాలం దక్షిణ
పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కి టిక్ మంచు ముద్దపైనా ఉంటుంది. వీటి ముక్కు
చిన్నదిగా, సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. నెత్తి నల్లగానూ మిగతా శరీరమంతా
తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా ఉంటాయి.
ఇవి సుమారు 14 అంగుళాల పొడవుంటాయి. రెక్కలు సుమారు 34 అంగుళాలు విస్తరిస్తాయి.
మే, ఆగస్టు మాసాల్లో 3 గుడ్లుపెడతాయి. చేపలు, బురదపాములు, కీటకాలను తింటాయి.
ఇవి సుమారు 3, 4 ఏళ్లు బతుకుతాయి.
No comments:
Post a Comment